STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనసు మచ్చట

మనసు మచ్చట

1 min
3


చిందులేయి చిందులేయి మనసా,
హృదయానికి వృద్దాప్యం రానీయకు మనసా.

కంటిపాప హర్షమంతా నీవేకదా మనసా,
స్నేహంలోని ప్రేమమధువే 
నీకు జీవశ్వాసకదా మనసా,
ఆటపాటల్లోని దరహాసమే 
సుస్వర రాగబంధమే మనసా,
పడుచువారి ఆటపాటలకు కాదూ 
వృద్ధుల హృదయభావనాలకు
రాగాలు కూర్చవే మనసా.

మదిలోని మధురిమలకు 
తీయని జ్ఞాపకంగా వుండిపోవా మనసా,
చిలిపి ఊహల స్నేహంలోనే 
స్వర్గముందే మనసా,
వేదనలకు మందు తెలిసిన స్నేహం 
ప్రేమకు నిత్యాభిషేకం చేయునే మనసా,
కనురెప్పల గిలిగింతల్లో 
వృద్ధాప్యం పడుచుదనం 
ముచ్చట్లు వేరుకాదే మనసా,
ముసలి మనసు మురిపాలను 
కథలు కథలుగా చెప్పి చైతన్యం నింపవే మనసా.


Rate this content
Log in

Similar telugu poem from Classics