STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎవరి కథ అయినా

ఎవరి కథ అయినా

1 min
3


నా కథ చెప్పడానికి నేను సరిపోను
ఎవరి కథ వారే డప్పు కొట్టుకుంటే
పచ్చనాకులు, పూలు, కాయలు మెరుస్తాయి
ముళ్ళ ముచ్చట పాతేయబడుతది
ఎన్నింటికో దుప్పటి కప్పుతాం
ఆదర్శాల అనుభూతులు గద్దెకెక్కుతాయి 

కన్నవాళ్ళు, కనిపెట్టుకొని ఉన్నవాళ్లు
నిజాల నిప్పులు పరిస్తే
బొమ్మ కట్టొచ్చు ఉన్నదున్నట్లు
కథ నాదైనా నీదైనా ఒకే వైద్యం 

నా కథ నేను రాసుకుంటే
కొంత సువాసనల పోపు వేస్తా
నల్లుల్లా చేసిన పనులు నలిపేస్తా
దోమలా రక్తం పీల్చినవి దాచేస్తా
కుక్కలా మొరిగినవి, కరిచినవి కప్పేస్తా
అర్థ సత్యాలు, మేకప్ చేసిన సత్యాలు
కళ్ల ముందు సూర్యునిలా కనిపిస్తాయి 

నా కథ నాకు నచ్చేలా చూసుకుంటా
ఎవరి కథలైనా, వెతలైనా అంతేనేమో
ఆత్మకథలు రాస్తారు ఎందరో
అసలైన ఆత్మ దాస్తారెక్కడో
పదిమందికి నచ్చేలా చిత్రించాలి బొమ్మ
అందరూ మెచ్చేలా అద్దాలి రంగులు
ఇది నా కథ, నీ కథ, అందరి కథ


Rate this content
Log in

Similar telugu poem from Classics