చెప్పనెవరికి
చెప్పనెవరికి
'చిత్తు'ప్రతిగ ఎన్నిసార్లొ..పుట్టానని చెప్పనెవరికి..!?
నీచుట్టూ తిరుగుటలో..పోయానని చెప్పనెవరికి..!?
నాకు-నేను గిరిగీసుకు..దాటలేని యాతనలో..
నా చుట్టూనే తిరుగుట..మానానని చెప్పనెవరికి..!?
తేడాలను తెలుసుకునే..దిద్దుకునే ప్రక్రియలో..
'నీ-నా'లను మనసారా..కాల్చానని చెప్పనెవరికి..!?
వేరేగా ఉన్నదెవరొ..బోధపడిన నేనెక్కడ..
బంగారపు వెన్నెలలో..ఆగానని చెప్పనెవరికి..!?
మాటలెంత పేలవమో..పేలకనే పేలేనవి..
చల్లబడే పేలాలను..ఆపానని చెప్పనెవరికి..!?
కర్మచక్ర బంధాలను..రాల్చుకునే వేడుకలో..
సుదరిశన చక్రమునే..పట్టానని చెప్పనెవరికి..!?
