నాలుకతో
నాలుకతో
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త
నరాలు లేని నాలుక పలుకులతో జాగ్రత్త,
నచ్చినట్టు మార్చుకొనే
వెక్కిరించు లోకులపట్ల జాగ్రత్త.
మితములేని వెటకారంతో
కన్నీటిని కానుకచేయు
బుద్ధిలేని నాలుకతో జాగ్రత్త,
మనసులోని విషాన్ని
మనసునేలు చెలిమిగా చెప్పేటి
తీపిముల్లుల మాటలతో జాగ్రత్త,
కనికరంలేని మనసు చేయు
విశ్వశాంతి యజ్ఞమంత్రాలతో జాగ్రత్త,
ఆనందపు చైతన్యం రగిలించక
ఆవేదనల ఊసులతో దారిమళ్లించు మాటలతో జాగ్రత్త.
విషంకక్కు
దుర్మార్గపు మాటలపై
మౌనం వహిస్తే బ్రతుకు జాగ్రత్త
విమర్శించు లోకానికి భయపడి
తెరల పొరలు తొలగించక సాగిపోతే జాగ్రత్త,
మాటల్లోని రాక్షసత్వం అణచివేయు
మాధవుడిగా నువు మారకపోతే జాగ్రత్త,
మంచిమాటే ప్రేమధనం
వంఛనమాటే హలాహలం
జ్ఞానమే గురువుగా
కులాసా ఏదో కుతంత్రమేదో
తెలుసుకొని సాగడమే
విజ్ఞతగల మనిషి లక్షణం.
