నేను
నేను
చెదరని చెరగని..నవ్వది నేనే..!
ప్రేమకు చెక్కని..రూపది నేనే..!
అందం చందం..వెతకగ దొరకదు..
బంగరు చిక్కని..వెలుగది నేనే..!
జగముల కాచే..చెలిమికి వారథి..
నేనని ఎగరని..పలుకది నేనే..!
నీవను నేనను..తేడా ఎఱుగను..
ఎఱుకను వీడని..గురువది నేనే..!
భృకుటిని కలనని..చెప్పగ తెలియను..
మాయకు అంటని..సత్తది నేనే..!
