STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

నీ.. జ్ఞాపకాల అలారం 🧭

నీ.. జ్ఞాపకాల అలారం 🧭

1 min
354

ప్రియా...!

నిన్ను చూసిన దగ్గరే ఆగిపోయింది కాలం

నీతో మాట్లాడిన రోజే మర్చిపోయాను నేను ఎవరు అని,


 ఎంతగా ప్రేమించాను... ఎంత ఆరాధించాను..

నువు ఎక్కడున్నా.. నీ జ్ఞాపకాలు మాత్రం

నా మనసులో పదిలంగా ఉన్నాయి.. ఉంటాయి ఎప్పటికి....


 ఒంటరితనం నన్ను పీడిస్తున్నా..నీ ఆలోచనల అలారం హృదయం లో మొగుతున్నా... మౌనంగా రోదిస్తున్నాను తప్ప నిన్ను ఏది అనను..అడగను..ఎందుకో అంత ప్రేమ


  మనం దూరం అవటం.. విడిపోవడం నాకు ఇష్టం లేకున్నా.. నీ ఆనందం కోసమే..నీకోసం.. దూరం అవుతున్న..


  ప్రేమ ఎవరికీ సంపూర్ణంగా.. శాశ్వతంగా దొరకదని

నా మనసును మభ్యపెట్టాలని చూస్తున్న..

వచ్చే కన్నీటికి అనకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న..


  ఇంకా ఎదో చిన్న ఆశ నా మనసుకి.. ఎదో అద్భుతం జరుగుతుంది అని.. ఒక మార్పు మళ్ళీ మన మనసులు ముడివేస్తుందని...


 ఇక ఆ మలుపు మన జీవితాల్లో శాశ్వతం అవుతుందని

కలకాలం మన ప్రేమ నిలిచిపోతుందని...


ఇదే ఆశ.. ఇదే నమ్మకం.. నన్ను.. బతికిస్తుంది..


శ్రీ....


హృదయ స్పందన.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance