STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics

4  

SATYA PAVAN GANDHAM

Classics

"అందని తార"

"అందని తార"

1 min
325

తన పెదవుటంచున చిరునవ్వులా నే చేరాలనుకున్నా...

తన కనురెప్పల వెనుక కన్నీటిలా నే మిగిలిన వేళ !!


తన యద వాకిళిలో చోటుకై నే శోధించినా...

తన మది లోగిలి వేటుకి నే కారణమైన వేళ !!


తన లక్ష్యపు దారిలో జాడనై నే నిలవాలనుకున్నా...

తన ఆశయపు ప్రయాణంలో అవరోధంలా నే మారిన వేళ !!


నడి రేయి చీకటి సైతం 

తనని దాచిన వేళ !!


కాచే వెన్నల వెచ్చగా 

నను తాకుతున్న వేళ !!


కునుకు కరువైన నా కనుపాప 

తన స్వప్నంతో మేల్కొన్న వేళ !!


ఈ వేళ...వర్ణించనా చెలి !!


నీ పై నా ప్రతీ భావం...

అక్షరాలుగా మలిచి పదం లా చేర్చి వాక్యంలా మార్చి 

కవితలా కూర్చి... 


నే కవిని కాకపోయినా.., 


కవి హృదయమై పొంగిపొర్లుతున్న వేళ !!

అందించగలనా? సఖి..!!

ఈ మధుర కావ్యం నీ పాదపు చెంతకు  

వేచివుండనా మరి !!

నీకై ఓ ప్రేమ పిపాసిల !!


✍️సత్య పవన్✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics