STORYMIRROR

T. s.

Romance Classics

4  

T. s.

Romance Classics

పరవశాల పరాగాలు

పరవశాల పరాగాలు

1 min
900

పరవశాల పరాగాలు...

వికసించిన పూవులపై మధువును గ్రోలే సీతాకోకచిలుకలా మధువనిలో మనసు పరవశాన మునిగినవేళ...

పూల పరాగాలు పరవశించే వేళ మత్తుగా గమ్మత్తగా సుగంధాలు శ్వాసిస్తూ నీ జతలో పరవశించి మనసు మరులు గొంటూ...


నీ నవ్వు నవరత్నమై ముత్యాల సరంలా అలరిస్తే పరవశాన పవళింపు సేవ చేయనా రస విహరినై...


ఏంకాతవేళ నీ తలపు గాలిలా నను సృజించి పరవశిస్తూ

విరహన వేదించే వేళ మది వెన్నెలై దరికి రమ్మంటుంది జతగా తోడుగా...


కోయిల రాగాలకు నీ మాటల పలుకులు సరాగాలు జతగా కూడి పరవళ్ళు తొక్కిన పరవశాన వసంతాలలో తేలియాడగా


చినుకులుగా రాలే నా భావ ప్రభంజనంలో మనసు పడే నాట్య విన్యాసాలకు పరవశమే మనసు పరవశమే..



Rate this content
Log in

Similar telugu poem from Romance