STORYMIRROR

Kadambari Srinivasarao

Classics

4  

Kadambari Srinivasarao

Classics

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు

1 min
365

శీర్షిక : *త్యాగ జీవులు*


సృష్టి కార్యంలో విజేయులై

లోకానికి ప్రేగు బంధాన్ని

పరిచయం చేయడం మాత్రమే కాక

ఉనికిని చాటడంలో కారణభూతులైన

దైవ సమానులు వాళ్ళు


సంసార సముద్రంలో సంభవించే

లెక్కకు మిక్కిలి ఆటుపోట్లకు

ఎదురీది సంతానపు నావను

సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో

నిరంతర శ్రామికులు వాళ్ళు


కష్టాల కొలిమిలో 

కాలిపోతున్నా లెక్కచేయక

జన్మనిచ్చిన సంతుకు 

సుఖ సంపద సమకూర్చే

త్యాగజీవులు వాళ్ళు


ఇంటి కోడల్లే 

అడ్డుగోడలై 

వేరు కుంపటికి

సిద్ధమైనా బదులు చెప్పని

బాధాతప్త హృదయాలు వాళ్ళు


రెక్కలొచ్చిన పక్షులు

సుదూరాలకు తరలిపోతూ

ఒంటరితనపు కానుకనిచ్చినా

సర్దుబాటుతో స్వీకరించే

శ్రేయోభిలాషులు వాళ్ళు


జీవన పయనంలో

చివరి మజిలీలో

ఇద్దరుగా మిగిలి

ఊపిరికి వీడ్కోలుకై

ఎదురు చూసే వృద్ధ పక్షులు వాళ్ళు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics