కొత్త గా
కొత్త గా
కవిత
రాతినైనా కాకపోతిని
రామపాదము నను సోకగా @ రామశర్మ
##########₹
పికమునైనా కాకపోతిని
బోయవానిని వాల్మీకిగ మార్చగా
వానరమునైనా కాకపోతిని
సేతువునే నిర్మించు సేనగా
రేగి ఫలమునైనా కాకపోతిని
శబరి రాముని కొసగగా
శరమునైనా కాకపోతిని
రాముని విల్లున సంధించగా
పాదుకనైనా కాకపోతిని
భరతుని భక్తిని చూపగా
అంగుళీకమైనా కాకపోతిని
సీతమ్మ మనసు ఉప్పొంగగా
తాళపత్రమైనా కాకపోతిని
రామ చరితము పంచగా
