STORYMIRROR

Ram Sarma

Inspirational

4  

Ram Sarma

Inspirational

ఎంత హాయి

ఎంత హాయి

1 min
315

రచన @ రామశర్మ 


హాయి ...ఎంత హాయి 

లాల పోసి ధూపమేయగానే 

చల్లనైన అమ్మ ఒడిని చేరగానే 

హాయి...ఎంత హాయి..  


చిట్టి తల్లి చిరునవ్వు 

మధురంగా ఒలకబోసే 

పాట పాడి ఊయలలో ఊపగానే 

హాయి..ఎంత హాయి...


బుజ్జి బుగ్గ సిగ్గులకే

దిష్టి చుక్క చిన్నబోయే

చిందులేసి అల్లరితో నింపగానే 

హాయి..ఎంత హాయి..


చంద్రబింబమల్లేను 

అందమైన పాపాయే

నింగి మీది తారలన్ని మెరవగానే

హాయి..ఎంతహాయి.


వన్నెతోడి మేనుకాంతి

మధురంగా పల్లవించే

రామపాట కమ్మగాను పాడగానే

హాయి...ఎంతహాయి.. 


హాయి..ఎంత హాయి..!!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational