Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ram Sarma

Inspirational

4.2  

Ram Sarma

Inspirational

గజల్ -1

గజల్ -1

1 min
265



రచన : @డి.ఎన్.వి. రామశర్మ‌

శీర్షిక : గజల్ రూపం..7-7-7-7


మాయచేసీ ఉన్నవన్నీ *తోడుకెళ్ళే నలుగురెవరో*

ఏనాటికీ వీడకుండా *తోడువెళ్ళే నలుగురెవరో*


తప్పలేకా దాటలేనీ క్లిష్టదారిన చేరుకుంటే 

స్నేహంగాను వారిదరికే *తీసుకెళ్ళే నలుగురెవరో*


పుణ్యమంతా తరాజులోనె కనిపించేను దూరమైనా 

నిశిరాతిరిని పిడికిలిపెట్టి *తోసుకెళ్లే నలుగురెవరో*


వెనుదిరగనీ శక్తిమేరకు చేసినట్టీ దానధర్మం

మరచిపోకా మాలగానే *వేసుకెళ్ళే నలుగురెవరో*


తిరిగెపుడైనా ఆశించనీ నిస్వార్ధమై నిలిచేవుగా

గురుతులన్నీ ఎదసంచిలో *పోసుకెళ్ళే నలుగురెవరో*


నువ్వులేనీ క్షణమొకటైన లేదులేదని నీచెంతనే

మౌనంగానె పంక్తిబోనం *చేసుకెళ్ళే నలుగురెవరో*


శ్వాసలేనీ జీవనయాత్ర తప్పదంటూ రామునిమాట

నీవెంటేగ మేమంటూనె *మోసుకెళ్ళే నలుగురెవరో*


Rate this content
Log in

Similar telugu poem from Inspirational