STORYMIRROR

Ram Sarma

Inspirational

4  

Ram Sarma

Inspirational

గజల్- సంఖ్య-2

గజల్- సంఖ్య-2

1 min
277

రామశర్మ‌- గజల్ -2

గతి: 6-6-6-6


అమ్మ చేతి ముద్ద కన్న తీపిలేదు ఎప్పటికీ!

నాన్న తోడు నీడకన్న గొప్పలేదు ఎప్పటికీ!


శ్వాస లోన నీ ఊసుల గుబాళింపు నిండుగాను

గుండె గుడిని చేరుకన్న మిన్నలేదు ఎప్పటికీ!


చిందులేయు చిరునవ్వుల చిరునామా నీదేనూ

కవ్వింతల ఉత్తరాలు వీడలేదు ఎప్పటికీ!


అలక వెనుక మర్మమేదొ తెలిసెనులే నజరానా 

నువ్వులేని క్షణాలనే చూడలేదు ఎప్పటికీ!


నిర్విరామ బంధమేను కలిపెనుగా ఇద్దరినీ

కలలోనూ చిక్కవన్న బాధలేదు ఎప్పటికీ !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational