STORYMIRROR

Ram Sarma

Inspirational

4  

Ram Sarma

Inspirational

గజల్ - ౩

గజల్ - ౩

1 min
337

గజల్ @ రామశర్మ 


పండుగే అందరిని కలిపేను ముచ్చటగ 

నిండుగా సందడే నిలిచేను ముచ్చటగ


గీతలై బంధాలు దూరమవి దగ్గ‌రై 

గతమదీ కొత్తగా నేర్పేను ముచ్చటగ 


ధనమున్న దొరలనీ కష్టపడు పేదలని

తేడాలు లేవనీ చూపేను ముచ్చటగ‌


రాబోవు రోజులవి మంచివే కనబడుతు

రాగాలు స్వేచ్ఛగా పలికేను ముచ్చటగ


తెరలన్ని తీయగా వెలుగులే చుట్టూర

కనులార విందుగా విరిసేను ముచ్చటగ 


పలుకులే తియ్యగా దొర్లగా అంతయూ

మనసులే మురిపమై కలిసేను ముచ్చటగ 


అందమే మనసంత చేరగా అక్షరమై

రాముడే రాయగా చదివేను ముచ్చటగ


Rate this content
Log in

Similar telugu poem from Inspirational