STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

ప్రేమ బహుమతి 💞

ప్రేమ బహుమతి 💞

1 min
521

  


ఒకప్పుడు ఎదురు చూడటం అంటేనే చిరాకు పడే నేను..

ఇప్పుడు ప్రతి రోజు.. ప్రతీ క్షణం ఎదురుచూస్తున్నా

నీ ప్రేమ కోసం.. నీ మాట కోసం..నీ రాక కోసం..


ఎదురుచూపు ఇంత మధురంగా ఉంటుందా అనిపిస్తుంది ఇప్పుడు అది నీ కోసం కాబట్టి..


 కనులు మూసి నిన్ను చూస్తున్న.. కనులు తెరిచి నిను ఆరాధిస్తున్న..


ఓయ్ బావ


నువు నా చెంత లేక నా చేతి గాజులు మూగపోయాయి..

నువు పక్కన ఉంటే నీ మెడ చుట్టూ నా రెండు చేతులు వేసి నిన్ను ముద్దాడుతుంటే ..

నువు పెట్టె చెక్కిలిగింతలకు

నా గాజులు చేసే అల్లరి శబ్దం ఎప్పుడు వింటావు.


 నీ పెదాలు నా కనురెప్పలను ముద్దాడుతుంటే 

నాలో పొంగే ఆనందభాష్పాల తడి నీ చేతిని తడిపేదెప్పుడు..


 నీ మునివేళ్ళు నా అణువనువు తడుముతుంటే

నీ చేతి స్పర్శకి నా నరాలు తమకంతో

తీయని సంగీతం వినిపిస్తుంటే...

ఆ అనుభూతిని మనం అనుభవించేది ఎప్పుడు..


నీ పెదాలు నా పెదాలను చుంబిస్తుంటే తేనెకన్నా తీయని ఆ మాధుర్యం గ్రోలేది ఎప్పుడు..


నువు తెచ్చిన మల్లెల సువాసన మైకం లో..

నా తనువుని .. నీ తనువు పెనవేస్తుంటే...

ఆ విరహపు సెగలో నేను కరిగి నీలో కలిసిపోయేది ఎప్పుడు..


మనం మన మరో ప్రతిరూపానికి ప్రాణం పోసేది ఎప్పుడు..


 మన ప్రేమ ప్రయాణంలోని.. మధురమైన క్షణాలు .. తీపి జ్ఞాపకాలు . అలకలు...గిల్లి కజ్జాలు ..

ఒకరికోసం ఒకరం పడే ఆరాటం.... ఒకరి ప్రేమ కోసం ఇంకొకరం చేసే పోరాటం... అన్నీ...


వచ్చే పాపాయిలో చూసుకునే రోజు కోసం...

ఆశతో..ఆరాటం తో... నీ రాక కోసమే... నువు ఇచ్చే అమూల్యమైన మన ప్రేమ బహుమతి కోసమే.. ఎదురుచూస్తున్నా....


నీ...

ముద్దుల మరదలు.


శ్రీ...

హృదయ స్పందన.





  



Rate this content
Log in

Similar telugu poem from Romance