STORYMIRROR

Kadambari Srinivasarao

Abstract Classics

4  

Kadambari Srinivasarao

Abstract Classics

వెలుగుల వర్షం

వెలుగుల వర్షం

1 min
377

అసుర తత్వాన్ని అంతమొందించి

దైవత్వాన్ని నింపుకొని

జ్ఞాన దీపాన్ని మనస్సులో వెలిగించి

అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే రోజు


ప్రతి ఇంటా చిరుమోముల సందడితో

ఆనంద కాంతులు వెల్లివిరుస్తూ

సాయం సంధ్య తారలకు పోటీగా

వెలుగుల వర్షం చిందే రోజు


మతాబుల కాంతులు పాల నురుగుల్లా

చిటపట్ల చప్పుడు పిల్లల సందడిలా

తారాజువ్వల గమనం అభివృద్ధి సంకేతంలా

భూచక్ర భ్రమణం కాల గమన చిత్రమయ్యేరోజు


ఇంటి ముంగిట కాంతులు వరుసకట్టి

చల్లని ప్రకృతికి ఆహ్వానం పలుకుతూ

మధుర రుచులను ఆస్వాదిస్తూ

రేయి సంతోషాలను పంచేరోజు


విష వాయువుల బట్టను

వాతావరణానికి తొడగకుండా

దేదీప్యమానంగా దీపావళి జరుపుదాం

పర్యావరణ మిత్రులుగా సాగుదాం



Rate this content
Log in

Similar telugu poem from Abstract