STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Crime Inspirational

3  

ARJUNAIAH NARRA

Romance Crime Inspirational

వేశ్య ....నిత్యం శోభన రాత్రే

వేశ్య ....నిత్యం శోభన రాత్రే

2 mins
313

నేను వేశ్యను 

నేను నిత్య కళ్యాణిని

నాకు ప్రతి రాత్రి శోభనం రాత్రే


నేను....

ఎంతమంది చిత్రకారుల కుంచెల చిత్తరువునో

ఎంతమంది కవుల కలంలో భావకవిత్వన్నో

ఎంతమంది యువకుల పగటి కలల రాణినో

ఎంతమందికి ఎన్ని రాత్రుల్లో నా మేని పులపానుపో..

ఎన్ని బిగికౌగిల్లో బందీనయ్యి నలిగిపోయానో

ఎన్ని కబంధ హాస్తాలలో చిత్రవదై పుండునైనానో

ఎన్ని ముద్దుల వర్షపు జల్లులో తడిసిపోయానో

ఎన్ని కామ వికారాలు పెనవేసుకున్నాయో

ఎన్ని కోరికల కొవ్వొత్తులకు కరిగిన మైనపు బొమ్మనో

ఎన్ని విరిగిన హృదయాలకు స్వాంతన కలిగించానో

అయినా నేను నిత్య కళ్యాణిని

నాకు ప్రతి రాత్రి శోభనం రాత్రే


నేను విధి వంచితినై

సంప్రదాయాల వలలో 

ముక్కోటి దేవతల పేరునై

మగాడి చేతిలో బలిపశువునై

వీధిలో ఆటబొమ్మనై

ఊరందరికి ఉంపుడుగత్థేనై  

వాటలుగా వాడేసుకొన్న

నా ఆడతనం 

చివరికి విసిరిన ఇస్తరిని 

కుక్కలు చింపినట్లయింది

ఇపుడు నేను పొట్టకూటికోసం 

పడుపు వృత్తితో 

కడుపు నింపుకొంటున్నవేశ్యను 


నా దగ్గరికి వచ్చిన వారికి

అంతరంగంమందు అర్థంలేదు

అర్దాంగి ముందు సత్యంలేదు

అమ్మ యందు ప్రేమేలేదు

దైవం ముందు భయంలేదు

హృదయమందు దయలేదు

తనువునందు తృష్ణ చావలేదు

నడిఈడు నక్కలు, ముసలి కుక్కలు

మర్యాదస్తులాగా మెలిగే దొంగలు

నీతి తప్పిన, సిగ్గుమాలిన వెదవలు

సుఖం పైన మోజుతో

తలనిండా కామం బూజుతో

తనువు నిండా విషపు కోరలతో

నివురు గప్పిన నిప్పుల కాంక్షలతో

చీకటి పడగానే వెచ్చధాననికి 

ఆరంగుల అడుగు పాము బుసలు కొడుతూ

నా మానపు పుట్టలో చలి కాచుకుంటుంది


కొంతమంది నా ఆడతనాన్ని 

డార్క్ చకోలేట్, డోనట్ లాగా 

అవురావురామని ఆరగించారు

మరికొంత మంది అందమైన పువ్వుల 

మకరందంతో తయారైన తేనేపట్టుల

నెమ్మదిగా స్వీకరించారు 

ఇంకా కొద్దిమంది యుద్ధ రంగ మందు

కత్తిలా జులిపించారు కాని మీ

మగవారికి ఎల్లప్పటికి నా ఆడతనం 

ఈ అనంత విశ్వంలో అర్థం కాని 

ఒక ప్రయోగ శాల మాత్రమే


అందుకే నా ఆడతనం

దేవుని గుడిలో నైవేధ్యం

జూదంలో పందెం

చీకటి తెరల వెనుక రాజి

వెండితెర అవకాశానిచ్ఛే నెరజానా

రాజకీయ కుర్చీ వెనుకాల అధికారం

రాజుల రాజ్యాలు నేలమట్టానికి వ్యూహం

రాహస్యాలను రాబట్టే రాచమార్గం

దౌత్య సంబంధాల తంత్రం

అతిధుల ఆనందానికి తాంబూలం


యుద్దానికి కారణం నేనె

శంఖరావం పూరించడానికి నేనే

సంధి జరపడానికి నేనె

శాంతికి పునాదిని నేనే

సంసారానికి సన్యాసానికి నేనే

పుట్టుకకు చావుకు నేనే...


ఈలాంటి పరస్పర విరుద్ధ వికృత వ్యవస్థను 

పోషిస్తున్న పెద్దలకు, మహాశయులకు 

ఓ వేశ్యగా నా విన్నపం...!

నేను యవ్వన తొలి దశలో పుల్ల ద్రాక్షని

యవ్వన మలి దశలో వగరు ద్రాక్షని

యవ్వన చివరి దశలో తీయ్య తీయ్యని ద్రాక్షని

నేను కాయగా ఉండినా, పండుగా పండిన, ఎండిపోయిన, వట్టిపోయిన 

నీకు ఆనందాన్ని పంచి, జ్ఞానాన్ని పెంచేందుకు

ఈ అనంత అద్భుత అదృష్ట సృష్టిలో

స్ర్తీగా జన్మను పొందినా దురదృష్ట జీవిని నేనే....


నేను ఓ స్ర్తీగా మీ తల్లిని, చెల్లిని, అక్కని, భార్యని

అయితే తల్లిగా ఈ ప్రపంచం నాదే.........

అవును తల్లిగా మీరందరు నా పిల్లలే!



Rate this content
Log in

Similar telugu poem from Romance