గుండె లేఖ
గుండె లేఖ


ప౹౹
గుండె లేఖనే రాస్తున్నా ఎదలో భావాలే ఒకటిచేసి
ఉండ లేకనే చూస్తున్నా మదిలో ఊహలే కలబోసి ౹2౹
చ౹౹
కల ఒకటీ కబురే చేసిందీ కలవరించకే ఓ మనసా
పలవరించి ఫలితమే నిలువరించకే సరి వయసా ౹2౹
కమనీయమే కదా ఆ పరవశం కనులతో చూడనే
సమయమీయవా మనసుకు సయోధ్యతో వేడనే ౹ప
చ౹౹
గుండెగాయానికి గుబురించే వలపు కదా ఔషధం
దండకూర్చి మరులనే దగ్గరచేర్చ లేదుగా నిషేధం ౹2౹
ఊసులూ ఊరించీ ఓ ఉత్తరమై ఉత్సాహంతోను
బాసలుగా మారి ప్రేరేపించెనూ ప్రోత్సాహంతోను ౹ప౹
చ౹౹
ప్రేరణే పెట్టుబడివాహినిగా సాగెను గుండె లేఖినీ
ఉత్ప్రేరణా తలపులే తమకమై నింపెనూ లేఖనీ ౹2౹
జాబు రాశాకా వేచి ఉన్నానులే జవాబు కోసమై
జాగు లేక నడిపించనీ మనసులో ఓ సన్నివేశమై ౹ప౹