వెన్నెల౼వెన్నెల
వెన్నెల౼వెన్నెల
ప౹౹
ఊరుకోవమ్మా వెన్నెల ఉడికించకే ఊసులతో
ఊరించకమ్మా నన్నిల ఆ చిత్రమైనా ఆశలతో ౹2౹
చ౹౹
వెన్నెల వెన్నెల నీవే చేసావు నన్నిలా నన్నిలా
వన్నెలే వరసకట్టి మల్లెలా మరిపించే నిన్నిలా ౹2౹
ఏరికోరి ఎంచుకున్నందకే ఎదలోనే నిలిచావు
సరిజేరి సరసాన్నీ సల్లాపంగానూ మలిచావు ౹ప౹
చ౹౹
చల్లని సమీరం నీతో కలిసీ సమ్మోహనం చేస్తే
ఝల్లని మది జరిపే వేడుకకు నీవే కదలి వస్తే ౹2౹
వేసవిరాతిరి వెలుగుల పున్నమి జతనే కడితే
ముసిమి తీరం ముద్దుగాను చేరనే తలపెడితే ౹ప౹
చ౹౹
ప్రేమికుల చుక్కానిలా దారి చూపేవు వలపులో
భావుకులకు చక్కని మార్గం పేర్చగా తలపులో ౹2౹
తన్మయాన్ని తనివితీరా ఆస్వాదించే నీనీడలో
జన్మసాఫల్యం జరిగి తీరూ ఆ అడుగుజాడలో ౹ప౹

