STORYMIRROR

SRINIVAS GUDIMELLA

Drama

4  

SRINIVAS GUDIMELLA

Drama

వేగము

వేగము

1 min
428

దూసుకెళ్లే నరుడా

కొంచం చూసుకెళ్ళరా గురుడా

కళ్ళు మోసుకెళ్తే పౌరుడా

ఛెళ్ళు మంటుంది చావు కొరడా !!


వేగం ఒక రోగం రా

స్రుతి తప్పిన రాగంరా

నియమం పాటించారా

సమయం ఇక నీదిరా !!


కట్లు కొట్టి నడపకురా

కటౌట్లు చూస్తూ గడపకురా

ఫీట్లు చేసి చూపకురా

పాట్లు పడతావ్ సహోదరా !!


సహనమనే ఇంధనం

నడపాలోయ్ వాహనం

దూకుడు ఒక వ్యసనం

చెయ్యి దాన్ని ఖననం !!


ముందు చూపు ముందర

పనికిరాదు తొందర

ప్రమాదాలు వద్దుర

నిదానమే ముద్దుర !!


Rate this content
Log in

Similar telugu poem from Drama