వదలని వాన
వదలని వాన
వదలని వాన
నా కళ్ళలోన
కురిసే ప్రతి క్షణం
అలిసే హృదయం
వదలని వాన
ప్రతి ఇంటిలోన
ఆడదై పుట్టిన
ప్రతి జీవితాన
వదలని వాన
మొదలాయే
అమ్మ కడుపులోన
బిడ్డను కాపాడుకోలేని
నిస్సహాయతలోన
వదలని వాన
ఆడపిల్లలకు
రక్షణ లేని
సమాజంలోన
వదలని వాన
నా గుండెలోన
ఆడపిల్లలపై
ఆగని అకృత్యాలకు
సాక్ష్యంగా నిలిచే
ప్రతి క్షణంలోన
వదలని వాన
నా కళ్ళలోన
ప్రతి క్షణంలోన
మెదిలే ప్రతి
ఆలోచనలోన
వదలని వాన
విడువని వాన
ప్రతి వేదనలోన
ప్రతి ఆడవారిలోన

