వచన కవిత 9-12-2022 : కవీశ్వర్ . శీర్షిక: మా నిర్ణయం - భవిష్యత్తు
వచన కవిత 9-12-2022 : కవీశ్వర్ . శీర్షిక: మా నిర్ణయం - భవిష్యత్తు
వచన కవిత
9-12-2022 : కవీశ్వర్ .
శీర్షిక: మా నిర్ణయం - భవిష్యత్తు
——————————-
మా బాలల మది నిష్కల్మష హృదయము
క్షేత్రంలో పెరుగుతున్న ఆరోగ్య మొక్కలము
మేము లక్ష్యాలను చేరే నిత్య కృషీవలులము
మా పెద్దల మాటే మాకు అనుసరణీయ పథము !
సమాజంలో మేము తప్పటడుగులు వేస్తె రక్షణము
మా గురువులనుండే లభిస్తుంది ,సరిదిద్దుకుంటాము
మా ఉపాధ్యాయుల సూచనలే మా జీవితాల కాధారము
వాటినే ఎల్లప్పుడూ పాటిస్తూ క్రమశిక్షణగా వృత్తినెంచుకుంటాము !
మా తల్లిదండ్రులు గురువులు గర్వపడేలా మేము ప్రవర్తిస్తాము
మేము కూడా వారికి పేరు ప్రఖ్యాతులను పొందింపజేస్తాము
మా క్రమశిక్షణ , అభ్యుదయ భావాలతో మా లక్ష్యాచేరుకుంటాము
మా జీవితాలలో వారికి ప్రత్యేక స్థానాన్ని కలుగజేసి,వారి క్రియలను పాటిస్తాము !
