వైద్యులు (prompt 26)
వైద్యులు (prompt 26)


వైద్యులు మన పాలిటి ప్రాణ దాతలు
వారిచ్చే మందుల చీటీలు, మన తలరాతలు
విని వ్రాసిన రాతను ఎవరూ మార్చలేరు
కానీ వీరు మనం చేసిన తప్పులను దిద్దగలరు
మనం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తెచ్చుకుంటాం రోగం
వీరు మన తప్పులను సరిచేసి కుదురుస్తారు ఆ రోగం
ఎటువంటి ప్రాణాంతక రోగానికైనా ఎదురు నిల్చే వైద్యులు
మనలను కాపాడేందుకు ఎందరో బలిచేసారు తమ ప్రాణాలు
మనం జీవితాంతం ఋణపడి ఉండవలసింది వారికే
మనసున్న మారాజులని, మనం మొక్క వలసింది వారికే.