వాయిదాల ప్రేమ
వాయిదాల ప్రేమ
ప్రియమైన ప్రియుడికి !
ప్రియమైన ప్రియురాలు
వ్రాయు ప్రేమ లేఖ,
మధురమైన క్షణాలను
జ్ఞాపకాలుగా మారుద్దామని
కోరికల రెక్కలు కట్టుకుని
నీ ఒళ్ళో తలపెట్టిన ప్రతిసారి
నీవు సాకులతో........
నేను ఇప్పుడంటే
నీవు తరువాతకి
నేను పగలు కోరితే
నీవు రాత్రికి వాయిదా
నేను రాత్రికి రమ్మంటే
నీవు రేపటికి ఆహ్వనం
నేను రేపటికి రెడీ అయితే
నీవు ఎల్లుండికి విసరడం
నీవు నన్ను కోరుకునే సరికి
బహుశా నీకు నేను దూరం అవుతానేమో..........?
నా మనసు ఉవ్విళ్లూరిన ప్రతి సారి
నా కోరికల రెక్కలను విరిచి పరిచావు....
నాది ఇప్పుడు ఎడారి కోరిక
ఎండమావుల కౌగిలింతా
అడవిగాచిన వెన్నెల
బహుశా మనది వాయిదాల ప్రేమ....
చిరు సంతోషాలను వాయిదాలు వేసుకొని
చివరగా ఆనంద క్షణాలను లెక్కగడితే....
మన ఇద్దరి జీవన ప్రయాణంలో
నాకు తియ్యటి జ్ఞాపకాల కంటే
చేదు జ్ఞాపకాలు ఎక్కువ ఇఛ్చినావు....
ఇక తియ్యదనం లేని ఈ రాత్రికి సెలవు....
******************************
దూరం నుండి సమీరం లీలగా
సినీ సంగీతాన్ని మోసుకొచ్చింది
"సిపాయి... సిపాయి
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో
ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి
సిపాయి ఓ... సిపాయి
హసీనా... హసీనా
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా
హసీనా ఓ... హసీనా"
*****

