ఊహాలోకం..
ఊహాలోకం..
తన పాటకు తానే పులకిస్తూ
అరమోడ్పు కన్నులతో గానం చేస్తూ
ఎన్నెన్నో ఆశల్ని మదిలో రేపుతూ
స్వచ్ఛంగా, ఆనందంగా,ఎగిరే చిన్ని పిట్టలా
ఎగరాలనుకుంది ....
వాస్తవ ప్రపంచం, ఊహకు వేరుగా ఉంటే...
లేచింది మొదలు.... ఊరుకులూ పరుగుల జీవితం.....
చూడ్డానికిదొక బ్రతుకు నృత్యం.
చివరకు ఎగరలేక చతికిల పడింది
ఆ చిన్ని పిట్టను చూస్తూ....
కన్నీటి పాటను పాడుతూ..
