ఉండలేను
ఉండలేను
రోజుకొక్క గజలైనా..వ్రాయకుండ ఉండలేను..!
ప్రతి శ్వాసన నిన్నుగూర్చి..పాడకుండ ఉండలేను..!
విరహానికి వియోగాన్ని..ఇవ్వడమే శుభయోగం..
అక్షరాల మౌనవీణ..మీటకుండ ఉండలేను..!
నీ నవ్వుల మెఱుపులెలా..దండయాత్ర చేస్తాయో..
కలనైనా ఆ పూలను..ఏరకుండ ఉండలేను..!
నడుస్తున్న నీడకన్న..కల్పవృక్షం మెక్కడుంది.. అల్లుకున్న తీవలన్ని..త్రెంచకుండ ఉండలేను..!
తలపుతలుపు మరులురేపు..మరుజన్మకు ద్వారమేగ..
ఈ ఏడ్పుల వెర్రిపుట్ట..కాల్చకుండ ఉండలేను..!

