తూనికరాళ్ళు
తూనికరాళ్ళు
అంగుళంగుళం అందగత్తెనని ఆమడ దూరంలోనే ఉంచేసావు
ఆరుగజాల చీర నే చుట్టానని మూరెడుమల్లెలు తీసుకురానినీవు
జానాబెత్తెడు బట్టకట్టిన దానినినెరజాణనంటూ చూసి లొట్టలేసావు
ఇంచు అందాలను తాకి ఆమెని అప్సరసంటూ అందలమెక్కించావు
చిటికెడు నవ్వుని ప్రేమనుకునితబ్బిబై తెగ సంబర పడిపోయావు
లీటరుబీరు పావుశేరు పలావుతినినోట్లని లెక్కచేయక గుమ్మరించావు
అడుగడుక్కి రోగం అంటించుకునికొండంత ఆస్తి కరిగినాక తిరిగివచ్చావు
ఇప్పుడింక రెండు గజాలైనా చాలని బారెడంత బాధ్యత నాకు అంటగట్టావు
చివర్లో గుప్పెడంత గుండెలో నేననిపిడికెడుప్రాణంలో పిడిబాకు దింపావు

