STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తరువు మనసు

తరువు మనసు

1 min
242


తనువుకు ఎన్ని గాయాలు చేసినా మీపై ప్రేమే నిలిచింది నామనసులో,
చుట్టూ చేరిన కలుపులను పెకిలిస్తూ చిరునవ్వుల దీపాన్ని వెలిగించావు నా మనసులో.

శ్రమశక్తితో ప్రగతిరథం నడిపించే అన్నదాత నేస్తంగా నిలిచావు నా మనసులో,
పచ్చని ప్రకృతికి 
దారులు ఏర్పర్చు సద్గుణంతో చేరావు నామనసులో,
ఋతురాగాన్ని గుర్తుచేయు 
నెచ్చెలిగా వున్నావు నామనసులో,
జాలిలేని లోకంలో 
రక్తంతో తడిసిపోయినా 
ఆకలి దప్పులు తీర్చేటి నేస్తంగా ఉండిపోయావు నామనసులో.

యాంత్రికయుగంలో 
నీవైభవం తగ్గినా 
మరచిపోలేని వ్యవసాయ పరికరంగా వున్నావు నామనసులో,
అమృతసిరుల పుట్టిల్లు 
వ్యవసాయ క్షేత్రమందు 
కల్పతరువు మెరుపులా వుండిపోయావు నామనసులో,
ముళ్లపొదల రాతిగుండెను 
పరిమళ పూదోటగా మార్చిన నీస్థానం పదిలం నామనసులో,
తేనెలు కురిసే పూలసొగసుకు 
రక్షణమై నిలిచావు ప్రతిహృదిలో.


Rate this content
Log in

Similar telugu poem from Classics