తరలి రాద తనే వసంతం
తరలి రాద తనే వసంతం


రాలిపోతున్న ఆకుల్ని కూడా చూసి శిశిరాన్ని ఇష్టపడ్డాను
ఎందుకంటే
శిశిరం తరువాత వసంతం రాక మానదు
చెట్లు కొత్త చివుర్లు వేయక మానవు
అలాగే ప్రేమ కోసం తపించి వేసారి మోసపోయి విసిగిపోయిన
నీ మనసుకు తప్పక సాంత్వన దొరక్క పోదు
నిన్ను అర్థం చేసుకునే వారు తప్పక నీ జీవితంలోకి వస్తారు
కానీ అంతవరకూ నిన్ను నువ్వు ద్వేషిస్తూ శిక్షించుకుంటావా
లేక
strong>
నీ తప్పొప్పుల్ని అంగీకరించి
నిన్ను నువ్వు అర్థం చేసుకొని
నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ
ఇతరులకు ప్రేమను పంచుతూ ముందుకు సాగుతావా
మిత్రమా
ముందుకు పద
అదిగో
నీ చిరునవ్వు కోసం కుటుంబమనే ప్రపంచం ఎదురు చూస్తోంది
కాస్త నవ్వి సంతోషాలు పంచు
నీ జీవితంలోకి రాబోయే వసంతాన్ని స్వాగతించు