తొలి కానుక
తొలి కానుక


గమ్యం తెలియని ప్రయాణం
గతంలానో స్వగతంలానో
నిన్నసరిస్తూ ఉంటుంది
గాలికూగే ఆకుల్లా అస్థిమితంగా మనసు
వర్తమాన భవిష్యత్తుల మధ్య ఊగుతుంంటుంది
గిరికీలు కొట్టే గాలిపటమై జీవితం
ఆశలదారాన్ని అంటిపెట్టుకునుంటుంది
కనుచూపు మేరా కనపడే శూన్యం
పూరించని ఖాళీలను వెతుక్కుంటుంటే
పూరిల్లుపై గడ్డిలా వయసుకు అనుభవాన్ని కప్పుతాం
పలుకో పదమో కప్పుకుంటూ మార్గశిరం
పాశురాలను అన్వయించుకుంటోంది
గాలిలోఎగిరే పావురాలజంట
వేరే జుంకితేనెలొద్దంటూ రాత్రిని నెమరేస్తున్నాయి
నెమ్మదిగా జారుతూ తొలిమంచు రోజుకి తొలికానుకలా ఉంది