STORYMIRROR

Midhun babu

Inspirational

3  

Midhun babu

Inspirational

తొలి గీతం

తొలి గీతం

1 min
118

తొలి వేకువ గీతమై సాగాలని...!!


తొలి వేకువ గీతమై సాగాలని

సూర్యుని కన్నా ముందే లేచాను

రాత్రి వెన్నెల నదిలో మునకలు వేస్తూ

మంచపు పడవలో పడుకొని కలలు కన్నాను..


అర్ధరాత్రి అభ్యుదయం మేల్కొల్పితే

భావ కవిత్వపు ఊహలు నిద్రపుచ్చే

శూన్యపు ఆకాశములో నక్షత్రాలు పలికితే

నేలపై రంగవల్లులు వికసించి నవ్వుతున్నాయి..


మూడు కాళ్ల వయసులో ప్రయాణం

వణుకుతున్న కట్టెకు ఆశలు జోడించి

నాలుగు కళ్ళతో లోకాన్ని వీక్షిస్తూ

వెన్ను కట్టిన తనువులో విషాదఛాయలు కనిపించే...


చేతుల రెక్కలు ముడిచిన ముఖం

ఎర్రగా కంది కొలిమి దగ్గర ఊపిరి పిలుస్తూ

నిప్పు కణాల సెగ తనువును తడిపే

నడుస్తున్న హోమం పిడికిలై మండుతుంది..


కూడలిలో ప్రసాదం కొందరికే లభిస్తే

రగిలే కడుపులో చలివేంద్రం ఉంటుందా

సమానత్వం లేని సంపద పెత్తనం చేస్తుంది

బురదలో చెయ్యికి రత్నం లభించక ఏడుస్తుంది..


ఆత్మబంధువుల నరాల్లో రక్తం పలచనయ్యే

ఆర్థిక అసమానతలు పువ్వులై కూర్చుంటే

క్రింద ఉన్న వేర్లు చింతిస్తూ ఎదురుచూస్తూ

చుక్క నీటి కోసం పాతాళం దిగుతున్నాయి....


ఆవకాయ రుచి లా తాతల బంధాలు

దాయాదుల పోరులో యుద్ధపు సూత్రాలు

తెల్లటి కపోతానికి ఎర్రటి మరకల చిహ్నాలు

సంఘములో శాంతి వచనాల ఆర్భాటాలు కనిపించే.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational