తన నవ్వే
తన నవ్వే
నా చుట్టూ అల్లుకున్న..పూలగాలి తన నవ్వే..!
నాలోలో ప్రవహించే..ప్రేమగాలి తన నవ్వే..!
ప్రాణమధువు వర్షించే..మేఘమెవరి కగుపించును..
తలపులెల్ల పండించే..పిల్లగాలి తన నవ్వే..!
ఉరుకులాడు ఊహలకే..ఊయలొకటి వేసేనా..
అక్షరాల ఊసులకే..చల్లగాలి తన నవ్వే..!
విరహనదుల నిలువరించి..ఎండగట్టు చిత్రముగా..
సంపెంగల చందనాల..తేమగాలి తన నవ్వే..!
వియోగాగ్ని కాభాసం..విచిత్రముగ జరిగేనా..
సశేషమౌ విశేషాల..వింతగాలి తన నవ్వే..!

