తన చూపుతౌ
తన చూపుతౌ
తనచూపుతొ కన్నీటిని తుడిచిందీ ఎవరదీ
మనసుగదిలొ తొంగి తొంగి చూసిందీ ఎవరదీ
రేయైనా ఆమెకొరకు వేచున్నా గుమ్మంలో
చీకటిలో చిరుదీపం పెట్టిందీ ఎవరదీ
నీరెండలొ వెన్నెలనీ కూర్చున్నా భ్రమపడీ
నెమలీకతొ నాచెక్కిలి నిమిరిందీ ఎవరదీ
శాశ్వితంగ నాగుండెలొ వుండాలని వుందేమొ
వలపుకోట నామదిలో కట్టిందీ ఎవరదీ
ముళ్ళన్నీ ఏరేసీ పూలబాట వేసాను
లేచివురుల పాదాలతొ నడిచిందీ ఎవరదీ

