తలపు
తలపు
నీకోసం చూస్తున్నది..కనులుకాదు తలపు..!
యాతనెంతొ పడుతున్నది..నేనుకాదు తలపు..!
చెప్పాలని ఉన్నమాట..గొంతుపెగిలి రాదు..
ప్రయాసలో ఉంటున్నది..పలుకుకాదు తలపు..!
వెతుకులాట మిగిలిపోయె..నేస్తంలా ఇపుడు..
గుండె ఆగి కొట్టుకొనుట..నిజముకాదు తలపు..!
వలపుదెంత వెర్రితనం..కలలలోన మునుగు..
ఆశకన్న పిచ్చిదేదొ..లేదుకాదు తలపు..!
నవ్వుగొప్ప ఆయుధమని..భావిస్తే తప్పు..
గుచ్చిగుచ్చి చంపుతుంది..మల్లుకాదు తలపు..!
తియ్యనైన దేదంటే..ఒకగాయం అందు..
ప్రేమ పుట్టినిల్లంటే..మనసుకాదు తలపు..

