తెలుసుకో
తెలుసుకో
అల్లరెంత చేశావో..అమ్మనడిగి తెలుసుకో..!
గుండెనెంత కోశావో..చెలియనడిగి తెలుసుకో..!
చిన్ననాడు చదువుకున్న..రోజులేల మరిచేవు..
జ్ఞానమెంత పొందావో..నడతనడిగి తెలుసుకో..!
బాధ్యతంటె తెలిసిందా..కోపపడిన వాడెవడు..
తెలుప నాన్న ఏడి..చెమటచుక్కనడిగి తెలుసుకో..!
మమకారం పెంచుకున్న..వారెవరోయ్ నీతోడు..
ప్రేమవిలువ అడుగకనే..భార్యనడిగి తెలుసుకో..!
స్నేహమనే కోవెలలో..విగ్రహాలు ఉండవోయ్..
ప్రాణదీప ధ్యానమే..శ్వాసనడిగి తెలుసుకో..!
