STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

తెలుసా నీకు

తెలుసా నీకు

1 min
6


కలువకు చంద్రుడు ఎంతో దూరమైనా

కలయిక ఇరువురికీ అసాధ్యమైనా

వలపుల చల్లని వెన్నెల కిరణం సోకినంతనే

పులకిస్తుందీ...

రేకులు విచ్చి వికసిస్తుందీ...

చెలువైనా అంతేనోయ్ !

ప్రకృతి తత్వమంతేనోయ్!


మగువపై మహిషంలా తాడించి

నీ మగతనానికి నీవే వెన్నుతట్టుకుని

ప్రక్కకు తిరిగి గుర్రుపెట్టి నిదురోయే

నీకేమి తెలుసోయ్ నారీతత్వం ? 


కన్నవారిని విడిచి ఏ కంజముఖీ 

 కాముకతకోసం చేరదు నీదరి

ఒక్క ప్రేమాన్విత వీక్షణం కోసం

ఒక్క సానుభూతి పదం కోసం

ఒక్క ఓదార్పు భుజం కోసం

పరితపిస్తుందీ...లభిస్తే

పులకించి పోతుందీ

వికసించి అనురాగ పరిమళం

వెదజల్లుతుంది

లతలా నిన్నల్లుక పోతుంది ..

నీ శృంగార వ్యాయామాలు

ఓడించలేవోయ్ ఏ వారిజనేత్రనూ !


నీ హృదిలో ఆమె రూపు కనుపిస్తే

నీ మదిలో ఆమెకు మాత్రమే చోటిస్తే

నీ కనులలో అమలిన అనురాగం కనుపిస్తే

అప్పగిస్తుంది ఆమె తన మనో తనువులను

సర్వం నీకే ఆప్పగించి

శూన్యమౌతుంది తాను !



Rate this content
Log in

Similar telugu poem from Romance