తేట తేట తెలుగు
తేట తేట తెలుగు


తేట తేట తెలుగు పీయూషం పూదేనె పుట్టతేనెకన్నా తియ్యనిది,
ఈ భవ్యమైన బాహుమూల్యమైన భాషకు ఉన్నది ప్రాచీన పునాది,
మాతృమూర్తి మమత సమత వలె చూపించెను కమనీయ కౌముది,
ఆంధ్రుల అంతర్వాహినిగా ప్రవహిస్తోంది ఈ మహనీయ మహానది |౧|
తెలుగు భాష ఒక సుమధుర మధు ధార,
తెలుగు భాష ఒక అమిత ఆకాశగంగధార,
తెలుగు భాష ఒక పావనమైన గోక్షీర ధార,
తెలుగు భాష ఒక శీతలమైన సరోవర ధార |౨|