STORYMIRROR

Midhun babu

Fantasy Inspirational Others

4  

Midhun babu

Fantasy Inspirational Others

తానేనోయ్

తానేనోయ్

1 min
5



మన భారత క్రికెట్మహా..రాజ్ఞియనగ తానేనోయ్..! 
చిరునవ్వుల 'స్మ్రతిమంధన'..గాకస్సలు వేరెవరోయ్..! 

జెన్ మార్గం తనదంటూ..తెలిపెనోయి చల్లగాను.. 
గెలుపుగూర్చి చింతలేక..సహజముగా ఆడేనోయ్..! 

రికార్డులను సృష్టించే..ఆలోచన చేయదసలు.. 
ఒకతరగని ఏకాగ్రత..సాక్షిగతను వెలిగేనోయ్..! 

వరించె తన ప్రతిభకెన్ని..అవార్డులో గమనిస్తే.. 
నిజప్రతిభా మణిహారం..ఇంకెవరని చూపెదమోయ్..! 

తరగని క్రీడాస్ఫూర్తి..గనియనగా తనమనసే.. 
మగువలకే ఆదర్శం..ఆమెతెగువ పొగడెదమోయ్..!

ఒకేఒక్క లక్ష్యంతో..సాగించెను తనపయనం.. 
గమ్యమేమి లేదంటూ..గగనాలను దాటేనోయ్..! 



Rate this content
Log in

Similar telugu poem from Fantasy