స్వప్న సుందరి
స్వప్న సుందరి
నీ సహచర్యంలో
నేను ప్రపంచపు
అవధులు
మర్చి పోతాను
నీ స్వాంతనం
కలిగించే అపూర్వ
అనుభవం లో
తడిసి ముద్దవుతున్న నాకు
ఒక అలౌకిక
సంగీత ఝరిలో
తేలియాడుతున్న
స్వప్న సుందరిలా
నా కనుల ముందర
మెరుస్తావు

