STORYMIRROR

Srinivasa Bharathi

Tragedy

5.0  

Srinivasa Bharathi

Tragedy

స్వేచ్ఛ... శ్రీనివాస భా రతి

స్వేచ్ఛ... శ్రీనివాస భా రతి

1 min
347

నాన్నా

ఇంటిదగ్గరే

చదువుకోవాలనుంది

నా ఊహాల్ని

చెప్పే భాష లేక

మౌనంగా

కళ్ళతో చెప్పినా

ఉరుముతున్న నీ కళ్ళు

ఉబుకుతున్న నా కన్నీళ్లను

గుడ్లలోనే కుక్కేసుకున్నాయి

నా కర్ధం ఐయింది

నా బాల్యం నీ చేతుల్లో బందీ అని

స్వేచ్ఛగా ఎగరాలనుకున్నా

రెక్కలు విరిచేశావ్ నువ్వు

అంత కష్ట పడక పోతే మాత్రం

నిన్ను పోషించలేననుకున్నావా?

నా తెలివి, నా చదువు

నాకన్నా నీకే ఎక్కువగా తెలుసా?

వద్దు నాన్నా

నా మీద పెట్టే పెట్టుబడి

నాకూ నీకూ పనికొచ్చేలా మారిస్తే

నేనూ

తమ్ముడూ కలిసే చదువు కొనేవాళ్ళం

కనీసం ఇప్పటికైనా

పోయిన నా స్వేచ్ఛ సాక్షిగా

తమ్ముడినైనా

ఎగరనివ్వు...

---------ooooooOoooooo------------


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy