STORYMIRROR

Sita Rambabu Chennuri

Drama

4  

Sita Rambabu Chennuri

Drama

స్వాగతవచనం

స్వాగతవచనం

1 min
468


మంచు పూలు పూసినట్టు డిసెంబర్

హేమంతవెలుగులలో సంబరాలు జరుపుకుంటోంది

చలిపులిని నడుముకు చుట్టుకుని అయ్యప్ప మాలధారుల బృందం

ఏకాగ్రతే మార్గమై సాగుతోంది


కాలబిలపు గుహలో జారిపోతూ 2019

జ్ఞాపకాల అంచుపై నడిచి పోతోంది

నడకమంచిదే అంటూ

వరించే అనుభూతులను ధరించాలని

కుతూహలం కొలతలతో లెక్కిస్తుంటావు

వేధించే అనుభవాలను చుట్టచుట్టి మనసుపొరల్లోకి తోసేస్తావు


నడక అడుగేయటమేకాదు దారితప్పిన నడతను

త్రాసులోని సూచీముల్లులా సవరించే దిక్సూచికూడా

ఐక్యతా సూత్రంలా సవరణలు వివరణల తరాజుతో

సమన్వయం చేస్తుంటుంది

ఉదయపు క్రతువులా నడక నిరాశానిస్ప్రహలను

ఆహుతిస్తుంటుంటే

స్వాగతవచనమై అడుగు పలకరిస్తుంటుంది


Rate this content
Log in

Similar telugu poem from Drama