STORYMIRROR

Dinakar Reddy

Drama Inspirational Thriller

4  

Dinakar Reddy

Drama Inspirational Thriller

సూపర్ పవర్

సూపర్ పవర్

1 min
284

పుస్తకాలు తిరగేసి

గూగుల్ లో వెతికేసి

గడ్డం బాగా పెంచిన వాళ్ళని అడిగేసి 

బుర్ర గోక్కున్నాడు


సిద్ధాంతులను కలిసి

వేదాంతులతో వాదించి

ఓ గొప్ప శక్తి కనుగొనాలని పరితపించి

అలసి సొలసి సొమ్మసిల్లాడు


ఓ మేఘం నీటిని చిలకరించింది

సూర్య కిరణం తట్టి లేపింది

ఆ రోడ్డు మీద ఒక చిన్న పిల్లాడు ఆగాడు

పడిపోయిన వ్యక్తికి నీళ్ళు ఇచ్చాడు


అతడు లేచి తేరిపార చూశాడు

ఏ సూపర్ పవర్ 

ఈ లోకాన్ని బాగు చేస్తుంది

అతని ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది


కరుణ కలిగిన హృదయాలు

ఇతరుల బాధను అర్థం చేసుకునే వ్యక్తులు

వీళ్ళే మార్చగలరు 

ఈ సమాధానం అతనికి ముందే తెలుసు

మరెందుకీ శ్రమ

ఎందుకీ లోకం ఇంకా ఇలానే ఉంది?


Rate this content
Log in

Similar telugu poem from Drama