స్త్రీ తపించునోయ్ !
స్త్రీ తపించునోయ్ !
మనది అందమైన భూమోయ్ ;
ఇక్కడ జీవనం ఒక వరమోయ్ .
బాల్యం బాగా ముచ్చటోయ్ ;
విద్య జ్ఞానాన్ని పెంపొందించునోయ్ .
ఆటలు ఆరోగ్యాన్నిచ్చునోయ్ ;
యువత దేశ భవిష్యత్తోయ్ .
ప్రేమికులు పరిమళించే పూవులోయ్ ;
ప్రేమ జీవులకోసమేనోయ్ .
అది పెళ్ళికి పునాదేనోయ్ ;
సంసారం సాగరమోయ్ .
క్రమశిక్షణతో జీవితం స్వర్గమోయ్ ;
మధురానుభూతులను పొందాలోయ్ .
మాతృత్వం గొప్పదోయ్ ;
అమ్మతనంకోసం స్త్రీ తపించునోయ్ .
ఆ మధురిమలు భావితరంకోసమేనోయ్ ;
తల్లిదండ్రులను గౌరవించాలోయ్ .
*** # *** # ***
