STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సోదరీ! ఏదీ నీ మతి?

సోదరీ! ఏదీ నీ మతి?

1 min
354

మేఘాలను చూసి 

మైమరచావా సోదరీ

ఆ మేఘాల పైన రెక్కల గుర్రం కనిపించిందా


అవును సహోదరీ

రెక్కల గుర్రం పైన బావగారు కనిపించారు

నీకోసమే వస్తున్నారు


అవునా

మన్మథుడా

నలకూబరుడా


అబ్బో ఎన్ని ఆశలు 

వరుడిపైనే శ్వాసలు


నీకు మాత్రం లేవటే

వెక్కిరింపులు చాలులే


సోదరీ

ఏదీ నీ మతి


కనిపించని రాయంచ కోసం

పరుగులు ఎందుకు

కాస్త అవనిపై నిల్చుని ఆలోచించు


ఎంత కుళ్లే నీకు

ఆశకు హద్దులు చెబుతూ

పెద్ద ఆరిందా అనుకుంటూ ఉండు


రేపు నీ పెళ్లి నేను చూడకపోతానా

నీ ఆశలు వినకపోతానా


అలాగే కానీ

ఆటలు చాలిక

ఇంటికి పోదాం..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract