సొంత గర్వం
సొంత గర్వం
అందరిలో ఉన్నది ఎదో గొప్పతనం,
అది కలిపించెను ఒకొక్కరికి ఒక నిండుతనం |౧|
ఉన్నత శిఖరం చేరిన కొద్దీ రాకూడదు గర్వం,
ఏ క్షణమునైన పాతాళానికి పంపించెను సొంత గర్వం |౨|
దూరమయ్యెను మనిషిలో మంచితనం,
అందరిని తక్కువ అనుకోవటంతో వచ్చెను తుంటతనం |3|
దుర్భాష మాట్లాడి నొప్పించెను అందరి మనసులు,
తనతో ఉన్నవారందరినీ అనుకొనెను తన దాసులు |౪|
ఎప్పడూ బలమైనది సమయం,
ఈనాడు ధిక్కరించిన వారితోనే తీసుకోవచ్చునేమో సహాయం |౫|
