STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సంకోచం

సంకోచం

1 min
377

నీ కౌగిట్లో ఉన్నా

నాకు సందేహం

నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో అని


నీ వాకిట్లో ఉన్నా

నాకు సందేహం

ఈ ముగ్గు నన్ను రమ్మనలేదేమో అని


నీ తలపుల్లో ఉన్నా

నీ వలపుల్లో ఉన్నా

నీ కొంటె చూపుల్ని గమనిస్తున్నా

నువ్వు నా మీద వేసే జోకుల్ని అర్థం చేసుకుంటున్నా

మౌనంగా రోదిస్తూ నాకు నేను సమాధానం చెప్పుకుంటున్నా


అంటే

ఇదంతా నేను నువ్వు కావాలనుకున్నందుకా

లేక ఎవరైనా నిన్ను కోరుకుంటే అంతేనా


నిన్ను అడగాలంటే ఏదో సంకోచం

కానీ తెలుసుకోవాలని ఉత్సాహం

తెలిసీ తెలియక నాతో నే ఆడుకున్నా చెలగాటం 


రాయిలా మారిన మనసును మామూలు చేస్తావని

నేనిలా బండబారిపోయాను


నా ప్రేమను నువ్వు ఇంకొకరితో పంచుకున్నాక

ఇంత కన్నా ఇంకేం చేయగలను

ఈ రాళ్ళలో అనురాగపు నీటిని ఎలా తెప్పించగలను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract