STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

స్నేహంలో

స్నేహంలో

1 min
0



ఎవ్వరేమి చేసిననూ..ప్రశంసించి తీరాలోయ్..! 
లేదంటే మౌనముతో..స్నేహంలో మునగాలోయ్..! 

లోలోపలి బాధ వలన..రోగమేదొ తగుల్కొనును.. 
వ్యతిరేకత రాలిపోవు..జ్ఞానమేదొ అందాలోయ్..! 

అసలిక్కడ పుట్టిందే..సంచి దులిపి విసిరేయగ.. 
అదేమరచి ఆదమరచి..పోవుటనే మానాలోయ్..! 

సత్యమెపుడు ఈ మాటల..కంటకనే ఉండునులే.. 
'శ్వాసపట్ల ధ్యాస'తోటి..గురుశక్తిగ వెలగాలోయ్..! 

ఎవ్వరెంత తురుంఖానొ..చిలుక కాస్త ఎగిరిపోతె.. 
అంటికూడ అంటనట్లు..జీవించగ తెలియాలోయ్..!

నిన్న కన్న నేడెంతగ..ఎదిగితిమో నేర్చితిమో.. 
అసలువెలుగు తేనెపట్టు..మాటుననే చేరాలోయ్..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics