స్నేహమా! ఇటు రాకుమా
స్నేహమా! ఇటు రాకుమా
పొరపాటైపోయింది బాబూ
తెలీక కోరుకున్నాను
అస్థిత్వమూ
ఆవకాయ జాడీ
నాకెందుకు ఇయ్యన్నీ
అయినా ఫ్రెండ్ అంటే ఎవరు
మనకి సపోర్ట్ చేయాలి
పోనీ మంచీ చెడూ చెప్పాలి
అదీ కుదరకపోతే మనకోసం ఒక కన్నీటి చుక్క కార్చగలగాలి
నీతో ఇవేవీ సాధ్యం కాదు
అర్థం అయ్యింది
ఇక నా వల్ల కాదు
ఏ రాకెట్టో ఎక్కి ఆ అంగారక గ్రహానికి వెళ్ళినా
నీ టార్చర్ తప్పేలా లేదు
అసలు ఫిలాసఫీ చదవడం ఎందుకు
నీలాంటి వాళ్ళు నలుగురు తగిల్తే చాలు
ఎక్కడ లేని జ్ఞానం వచ్చేస్తుంది
ఇదంతా వద్దు
సోది చెబుతున్నా అనే పేరు నాకొద్దు
ఇక నీకూ నాకూ కచ్చి
అదే కటీఫ్
ఆ..
బేవకూఫ్ కాదు
కటీఫ్
వినిపించట్లేదా
హలో..
ఒరేయ్ ఉన్నావా
ఏ అంటార్కిటికాకో పోయి చలి కాచుకో
రేపు పార్టీ లేదు
నా దగ్గర డబ్బుల్లేవు
ఇంక ఫోన్ పెట్టేయ్
