STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

స్నేహానికి విలువ

స్నేహానికి విలువ

1 min
318

స్నేహమే శాశ్వతం అని

ఇప్పుడిక చెప్పలేను

మనకెదురయ్యే అనుభవాలు

అభిప్రాయాల్ని మార్చొచ్చు


ఎదుగుదలను బట్టి

దినచర్య మారొచ్చు

కానీ జ్ఞానాన్ని బట్టి

స్నేహితుల్ని మార్చేయగలమా


ఎక్కువ తక్కువ స్థాయిని చూసి

నే నిన్ను పలకరించలేదే

అస్థిత్వం కోల్పోవడంలో

ఒక మజా ఉంది

ఎప్పటికీ ఉంటుంది కూడా


కానీ 

ఎప్పటికీ నిరర్థకంగా ఉండిపోవడం

నీతో స్నేహానికి ఆధారం అయితే

అలాంటి బంధాన్ని నే కోరుకోను

స్నేహానికి మారకపు విలువను

నేనైతే నిర్ణయించలేను 


దూరంగా ఉండి

సొంత నీడలో సేదదీరతాను

మూర్ఖత్వానికి చిరునామాగా ఉన్న నేను

ఇంకెప్పుడూ నీకు కనిపించను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract