సమయం (prompt 24)
సమయం (prompt 24)


సమయం ఉండదు అందరి వద్దా ఎప్పుడూ ఒకే విధంగా
కొందరి వద్ద సమయం ఉంటుంది గడిపేందుకు వృథాగా
సమయమే చాలదు కొందరికి తినడానికైనా తీరుబడిగా
కొందరు సమయం లేదని పరుగులు పెడతారు వెర్రి గా
ఒకే లాగా ఇచ్చాడు దేవుడు అందరికీ సమయం
మనిషి మనస్తత్వాన్ని బట్టి వాడుకుంటాడు సమయం
వృథా చేయని వారికి ఎంతో అమూల్యమైనది సమయం
పని పాటలులేని వారికి గడవమన్నా గడవనిదే సమయం.